Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సహాయం నిలిపివేత
ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్‌కు 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,100 కోట్లు) ఆర్థిక సహాయాన్ని నిలిపివేయనున్నట్టు అమెరికా ప్రకటించింది.
  • అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రూపొందించిన నూతన దక్షిణాసియా విధానానికి మద్దతు తెపకపోవడం, ఉగ్రవాద సంస్థలైన హక్కానీ నెట్‌వర్క్‌, లష్కర్‌ ఏ తోయిబాపై కఠినంగా వ్యవహరించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ స్పష్టం చేసింది.
  • పాకిస్థాన్‌కు అందిస్తున్న పలురకాల సహాయాలను నిలిపివేస్తున్నట్టు జనవరిలో చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ నిర్ణయం వెలువడింది.
  • సంకీర్ణ మద్దతు నిధి (కొయిలేషన్‌ సపోర్ట్‌ ఫండ్‌-సీఎప్‌ఎఫ్‌) కింద ఇవ్వాల్సిన ఈ నిధులను నిలిపివేశామని పెంటగాన్‌ వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్‌ ఆమోదించాల్సి ఉంది. 

views: 729

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams