Current Affairs Telugu Daily

2017-18లో భారత్‌కి వచ్చిన ఎఫ్‌డీఐల్లో మారిషస్‌కు అగ్రస్థానం
2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు అధిక శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) మారిషస్‌ నుంచే తరలి వచ్చాయి. దీని తరవాత స్థానంలో సింగపూర్‌ నిలిచింది.
  • 2017-18లో మొత్తం 37.36 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు భారత్‌కు తరలివచ్చాయి. 2016`17 ఆర్థిక సంవత్సరం వచ్చిన 36.31 బి.డాలర్లతో పోలిస్తే ఇవి స్వల్పంగా ఎక్కువ.
  • మారిషస్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు 13.38 బిలియన్‌ డాలర్ల నుంచి 13.41 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. సింగపూర్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు 6.52 శాతం నుంచి 9.27 శాతానికి చేరాయి. నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన ఎఫ్‌డీఐలు మాత్రం 3.23 శాతం నుంచి 2.67 శాతానికి తగ్గాయి.
  • తయారీ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 11.97 బి.డాలర్ల నుంచి 7.06 బి.డాలర్లకు తగ్గాయి. సమాచార సేవ రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 5.8 బి.డాలర్ల నుంచి 8.8 బి.డాలర్లకు పెరిగాయి. రిటైల్‌, టోకు వాణిజ్య రంగంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలు 2.77 బి.డాలర్ల నుంచి 4.47 బి.డాలర్లకు పెరిగాయి.

views: 873

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams