Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు 
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన 2018 సెప్టెంబర్‌ 2న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. 
కేబినెట్‌ నిర్ణయాలు
  • వైద్య ఆరోగ్య శాఖలోని ఒప్పంద (కాంట్రాక్ట్‌) ఉద్యోగల వేతనాలు పెంపు. జాతీయ పట్టణ ఆరోగ్య కార్యక్రమం(ఎన్‌యుహెచ్‌ఎం)లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు, ఆశావర్కర్లు, గోపాలమిత్రలకు గౌరవవేతనం పెంపు
  • వివిధ శాఖల్లో కొత్త పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం
  • బీసీలకు చెందిన 36 కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనా నిర్మాణానికి 71 ఎకరాలు, రూ.70 కోట్లు కేటాయింపు
  • హైదరాబాద్‌లోని రాజాబహద్దూర్‌ వెంకట్రామారెడ్డి కళాశాల (రెడ్డి కాలేజీ) హాస్టల్‌ భవనానికి గతంలో ఇచ్చిన 10 ఎకరాలకు అదనంగా మరో 5 ఎకరాలు భూమి కేటాయింపు 
  • ఆయాల్లో పూజారుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంపు. అర్చకులకు వేతనాలను ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంకు ఖాతా ద్వారా చెల్లించాలని నిర్ణయం
  • కరీంనగర్‌ జిల్లా మిడ్‌మానేరు గండివల్ల నష్టపోయిన మన్యాడ గ్రామంలో ఒక్కో కుటుంబానికి రూ.4.5 లక్షలు చొప్పున రూ.25.84 కోట్లు సాయం
  • గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1200 మంది గోపాలమిత్రలకు గౌరవ వేతనం రూ.3500 నుంచి రూ.8500కు పెంపు. 
  • సంగారెడ్డి జిల్లా వెలిమలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి మేధో సర్వో డ్రైవ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 32.32 ఎకరాలు. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెండగడపలో సీఆర్‌పీఎఫ్‌కు 70 ఎకరాలు
ఖాజాగూడలో కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌కు 3 ఎకరాల భూమి 
వివిధ సాగునీటి ప్రాజెక్టులకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రూ.10,001 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం 
రహదారులు, భవనాల శాఖకు రూ.3000 కోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం 
వైద్య ఆరోగ్య శాఖలోని 25,045 మంది ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ.6000 నుంచి రూ.7500కు పెంపు
రెండో ఏఎన్‌ఎంకు ఇస్తున్న వేతనం రూ.11 వేల నుంచి రూ.21వేలకు పెంపు
ఒప్పంద (కాంట్రాక్ట్‌) వేతనంతో పని చేస్తున్న డాక్టర్లకు వేతనం రూ.36 వేల నుంచి రూ.40 వేలకు పెంపు
జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌యుహెచ్‌ఎం)లో పనిచేస్తున్న ఏఎన్‌ఎరు, స్టాఫ్‌నర్స్‌లు, ఫార్మాసిస్టులు 9 వేల మందికి కనీసం వేతనాలు అమలు 

views: 810

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams