Current Affairs Telugu Daily

కచ్చితమైన అనువాదానికి కొత్త విధానాన్ని రూపొందించిన ఫేస్‌బుక్‌
భాషా, వ్యాకరణ వనరులు అంతగా అందుబాటులో ఉండని ఉర్దూ, బర్మీస్‌ తదితర భాషలను కూడా అత్యంత కచ్చితత్వంతో, వేగంగా ఇతర భాషల్లోకి తర్జుమాచేసే సరికొత్త విధానాన్ని ఫేస్‌బుక్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధో సాంకేతికత ఆధారంగా దీన్ని రూపొందించారు.
  • ఇప్పటికే కొన్ని భాషల్లోని సందేశాలను ‘ఆటోమేటిక్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేషన్‌’ ద్వారా ఖాతాదారులకు అర్థమయ్యే భాషల్లోకి ఫేస్‌బుక్‌ భాషాంతరం చేస్తోంది. కానీ, భాష, వ్యాకరణ, సాహిత్య సామగ్రి అంతగా అందుబాటులో లేనివాటి విషయంలో ఇది సాధ్యం కావట్లేదు.
  • వికిపీడియా తదితర విభిన్న భాషల్లోని వెబ్‌సైట్లలో ఉండే వాక్యాల ఆధారంగా ‘సమాంతర రచనా సామగ్రి’ని రూపొందించి మిగతా భాష అనువాదాన్నీ ఫేస్‌బుక్‌ ఆర్టిఫీషియల్‌ రీసెర్చ్‌ (ఫెయిర్‌) విభాగం సుసాధ్యం చేసింది.
  • త్వరలోనే ఈ కొత్త మిషీన్‌ ట్రాన్స్‌లేషన్‌ విధానాన్ని ఎంపిరికల్‌ మెథడ్స్‌ ఇన్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ సంస్థ ముందు ఉంచనున్నట్లు ‘ది ఫోర్బ్స్‌’ తెలిపింది.

views: 746

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams