Current Affairs Telugu Daily

వనజీవి రామయ్య ప్రకృతి సంరక్షణ నిధి ఏర్పాటు 
పచ్చదనం పెంపుదల, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ‘వనజీవి’ రామయ్య చేస్తున్న కృషికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేర్‌ ఆసుపత్రుల గ్రూపు, కేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2017 జూన్‌ 20న  వనజీవి రామయ్య ప్రకృతి సంరక్షణ నిధిని ఏర్పాటు చేశారు. ఇందులో మొదటగా  కేర్‌ ఆసుపత్రుల గ్రూపు, కేర్‌ ఫౌండేషన్‌ రూ.లక్ష జమ చేసింది. ప్రక ృతి ప్రేమికులు ఈ నిధిలో నగదును జమచేస్తే ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా రామయ్యకు అందజేస్తామన్నామని కేర్‌ ఆసుపత్రుల గ్రూపు సీఎండీ డా॥ సోమరాజు, కేర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డా॥ రాజగోపాలరాజు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ దరిపెల్లి జానకిరామయ్య (వనజీవి రామయ్య), ఆయన భార్య జానమ్మను వీరు శాలువా కప్పి సత్కరించారు. 
views: 1084

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams