Current Affairs Telugu Daily

35 పాఠశాలలకు రాష్ట్ర స్వచ్ఛ పురస్కారాలు
రాష్ట్రవ్యాప్తంగా 2017-18 విద్యా సంవత్సరానికి రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు 35 పాఠశాలలు ఎంపికయ్యాయి. వాటిల్లో 4 తప్ప మిగిలినవన్నీ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలే ఉన్నాయి.
  • రక్షిత మంచినీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత ఆధారంగా వాటిని పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసింది. బడుల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది.
  • కేంద్ర మార్గదర్శకాల ప్రకారం మొత్తం 1488 పాఠశాలల నుంచి 48 పాఠశాలలను జిల్లాస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపిక చేశారు.
  • ప్రతి జిల్లా నుంచి 8 పాఠశాలల చొప్పున 239 ప్రతిపాదనలు స్వీకరించి వాటిల్లో రాష్ట్రస్థాయి కమిటీ 35 పాఠశాలలను ఎంపిక చేసింది. 

views: 856

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams