Current Affairs Telugu Daily

‘ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు’ ప్రారంభం 
దేశంలోని పోస్టాఫీసు, సబ్‌ పోస్టాఫీసుల్ని ‘ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు’(IPPB)గా మారుస్తూ 2018 సెప్టెంబర్‌ 1న న్యూడిల్లీలో ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రంలోని తపాలా శాఖను IPPBగా గుర్తిస్తూ ప్రత్యేక కవర్‌ విడుదల చేశారు. ఖాతాలు తీసుకున్న వారికి క్యూఆర్‌ కార్డును అందజేశారు.
  • సుమారు 1.55 లక్షల తపాలా శాఖలు, 3 లక్షల మంది పోస్ట్‌మెన్‌, గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌లతో బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఇంటికీ, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి తోడ్పడటానికి ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(IPPB)ను ప్రారంభించారు. ఈ బ్యాంకు సేవ లు ఇతర సాధారణ బ్యాంకుల మాదిరిగానే ఉన్నా కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. IPPBలో ముందస్తు రుణాలు(అడ్వాన్స్‌డ్‌ లోన్స్‌), క్రెడిట్‌ కార్డు వంటి సేవలు లేవు.  రూ.1 లక్ష వరకున్న డిపాజిట్లనే అంగీకరిస్తారు.
  • ఇతర బ్యాంకుల మాదిరిగానే విదేశాల నుంచి నగదు బదిలీ, మొబైల్‌ చెల్లింపు, ట్రాన్స్‌ఫర్స్‌, ఏటీఎం, డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, థర్డ్‌పార్టీ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ తదితర సేవలు అందిస్తాయి
  • డిపాజిట్లపై 4 శాతం వడ్డీ చెల్లిస్తారు
  • వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్‌మన్‌ సేవింగ్స్‌, కరెంట్‌ ఖాతాను తెరుస్తాడు
  • రుణాలు, బీమా వంటి థర్డ్‌పార్టీ సేవలు అందించేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బజాజ్‌ అలియాన్జ్‌ జీవిత బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది
  • రూ.1 లక్ష మించే డిపాజిట్లను ఆటోమేటిక్‌గా పొదుపు ఖాతాలుగా మార్చుతారు
  • కౌంటర్‌ సేవలు, మైక్రో ఏటీఎంలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌, మెసేజింగ్‌, ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సేవలు అందుబాటులో ఉంటాయి
  • ఆధార్‌ సాయంతోనే ఖాతాలు తెరుస్తారు. ఖాతాదారుడి గుర్తింపు ధ్రువీకరణ, చెల్లింపు, లావాదేవీలకు క్యూఆర్‌ కోడ్‌, బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తారు
  • లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌కు స్మార్ట్‌ఫోన్‌లు, బయోమెట్రిక్‌ పరికరాలను సమకూరుస్తారు
  • ఈ బ్యాంకులో 100 శాతం వాటా ప్రభుత్వానిదే. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌తో పోటీపడేలా IPPB మూలధన వ్యయాన్ని కేంద్రం ఇటీవలే 80 శాతం పెంచింది
  • ఐపీపీబీ సేవలు మొదట 650 తపాలా శాఖలు, 3,250 యాక్సెస్‌ పాయింట్లలో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా దేశంలోని అన్ని శాఖలకు విస్తరిస్తారు
  • గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల యాక్సెస్‌ పాయింట్లు నెలకొల్పనున్నారు
  • 17 కోట్ల పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలను IPPB ఖాతాతో అనుసంధానం చేయడానికి అనుమతి ఉంది
IPPB-  India Post Payments Bank

views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams