Current Affairs Telugu Daily

ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ భారత విభాగం విలీనం 
టెల్కో దిగ్గజాలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ భారత విభాగం విలీనం పూర్తయ్యింది. ఇకపై వొడాఫోన్‌ ఐడియాగా వ్యవహరించే ఈ సంస్థకు 40.8 కోట్ల మంది యూజర్లు, 35 శాతం మార్కెట్‌ వాటా ఉంటుంది.
  • సుమారు 23.2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 1.6 లక్ష కోట్లు) విలువ చేసే ఈ డీల్‌తో వొడాఫోన్‌ ఐడియా నంబర్‌వన్‌ టెల్కోగా ఆవిర్భవించగా.. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్‌  2వ స్థానానికి పరిమితమవుతుంది.
  • ఆదిత్య బిర్లా గ్రూప్‌ (ఐడియా సెల్యులార్‌ ప్రమోటర్‌) అధిపతి కుమార మంగళం బిర్లా కొత్త సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీనికి 12 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుందని ఇరు సంస్థలు తెలిపాయి.
  • ఐడియా సెల్యులార్‌ ఎండీగా హిమాంశు కపానియా తప్పుకున్నారని, అయితే విలీన సంస్థలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని పేర్కొన్నాయి. వొడాఫోన్‌ ఐడియాకు బాలేశ్‌ శర్మ సీఈవోగా ఉంటారు.
  • చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ని నియమించే అధికారాలు వొడాఫోన్‌కు ఉంటాయి. తాజా డీల్‌తో మూడు ప్రైవేట్‌ టెల్కోలు, ఒక ప్రభుత్వరంగ సంస్థ (బీఎస్‌ఎన్‌ఎల్‌) మాత్రమే మార్కెట్లో మిగిలినట్లవుతుంది.
  • వ్యయాలు తగ్గించుకునేందుకు, ప్రత్యర్థి సంస్థ రియన్స్‌ జియోను మరింత గట్టిగా ఎదుర్కొనేందుకు ఐడియా, వొడాఫోన్‌కు ఈ విలీన డీల్‌ తోడ్పడనుంది.
  • ఈ ఒప్పందంతో సుమారు రూ. 14,000 కోట్ల మేర వ్యయాలు ఆదా కాగవని అంచనా వేస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి.
  • డీల్‌ ప్రకారం వొడాఫోన్‌ ఇండియా సంస్థాగత విలువను రూ. 82,800 కోట్లుగాను, ఐడియా విలువను రూ. 72,200 కోట్లుగాను పరిగణించారు. కొత్త సంస్థలో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 26 శాతం వాటాలు ఉంటాయి.

views: 981

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams