Current Affairs Telugu Daily

ప్రియా వారియర్‌పై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
కన్నుగీటి పాపులర్‌ అయిన మలయాళ నటి ప్రియా వారియర్‌పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
  • ‘ఒరు ఆదార్‌ వ్‌’ సినిమాలోని పాట కారణంగా మత విశ్వాసాలు దెబ్బతిన్నాయంటూ నటి ప్రియ, దర్శక, నిర్మాతపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కేసు నమోదయ్యాయి. దీంతో ప్రియ, దర్శక, నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • సినిమాలో వివాదానికి కారణమైన ఆ పాట 1978 నుంచి ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం ఆదరణ పొందిన ఒక జానపద గీతమని ప్రియా తరఫు న్యాయవాది తెలిపారు.  పాటపై తమకెలాంటి అభ్యంతరం లేదని, చిత్రీకరణే అభ్యంతరకరంగా ఉందంటూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ఎవరో పాటలు పాడుకుంటున్నారు.
  • కేసు నమోదు చేయడం మినహా మీకు మరే పనీ లేదు..’ అంటూ తెలంగాణ పోలీసు తీరుపై మండిపడింది.

views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams