Current Affairs Telugu Daily

ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్ల జన్యువు గుర్తింపు 
క్యాన్సర్‌ చికిత్సారంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్లలో కణితి కణాల పెరుగుదల, దాడిని నియంత్రిస్తున్న జన్యువులను గుర్తించారు.
  • సాధారణంగా ట్రిపుల్‌ నెగిటివ్‌ రొమ్ము క్యాన్సర్లలో కణితి కణాలు.. ఊసరవెల్లి రంగు మార్చుకునే తరహాలో ఎప్పటికప్పుడు తమ రూపాన్ని మార్చుకుంటాయని అమెరికాలోని సాల్క్‌ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు.
  • ఒకే కణితిలో భిన్నరకాల కణాలుంటాయని వెల్లడించారు. కొత్త భాగాలకు వెళ్లి సమూహంగా ఏర్పడే సామర్థ్యం వాటిలో అధికంగా ఉంటుందని చెప్పారు. ఫలితంగా మెరుగైన చికిత్స అందించడం కష్టమవుతుందన్నారు.
  • ‘సాక్స్‌10’ అనే జన్యువు కణితి కణాలు తమ రూపం మార్చుకోవడాన్ని నియంత్రిస్తున్నట్లు తాజాగా కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్లను మెరుగ్గా గుర్తించేందుకు, సరికొత్త చికిత్సామార్గాలను అభివృద్ధి చేసేందుకు తమ ఆవిష్కరణ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

views: 890

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams