Current Affairs Telugu Daily

గురు గ్రహంపై నీటి జాడలు : నాసా 
గురు గ్రహంపై భారీ ‘అరుణ మచ్చ’ను నిశితంగా పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు నీటి జాడలు తారసపడ్డాయి. ఎరుపు రంగులో దట్టమైన మేఘాలతో నిండిన ఈ మచ్చను అరుణ తుపానుగా పిలుస్తున్నారు.
  • ఇది 350 సం॥ల నుంచి సుడులు తిరుగుతున్నట్లు అంచనాలున్నాయి. దీనిపై నాసా గుడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ ఖగోళ శాస్త్రవేత్త గోర్డన్‌ ఎల్‌.జోరాకెర్‌ నేతృత్వంలోని నిపుణులు పరిశోధనలు చేపట్టారు.
  • భూమిపై ఏర్పాటుచేసిన టెలిస్కోప్‌తో దీన్ని లోతుగా పరిశీలించారు. దీంతో దట్టమైన మేఘాలపై నీరున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఆక్సిజన్‌ స్థాయిలు కూడా సూర్యుడి కంటే  2 నుంచి 9 రెట్లు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంచనా వేశారు.
  • గురుడిపై విస్తృతంగా నీరుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజా పరిశోధనతో ఈ వాదన మరింత బలపడింది. గురుడిపై అన్వేషణకు నాసా జునో వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది.
  • దీనిలో ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోమీటర్‌, మైక్రోవేవ్‌ రేడియోమీటర్‌లు ఉన్నాయి. ఇవి భూమిపై ఉపరితలంలోని వాతావరణ పీడనం కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండే పీడనాన్ని  కూడా తట్టుకొని ఉపరితలంపై విశేషా గుట్టు విప్పగలవు.
  • ఇవి సేకరించే సమాచారంతో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే వీలుంది.
NASA-National Aeronautics and Space Administration

views: 880

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams