Current Affairs Telugu Daily

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు : న్యాయ కమిషన్‌ 
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదని, ఈ దశలో అది వాంఛనీయం కాదని న్యాయకమిషన్‌ స్పష్టం చేసింది.
  • దేశంలో వ్యత్యాసాలు ఉన్నంత మాత్రాన వివక్ష ఉన్నట్లు కాదని, బలమైన ప్రజాస్వామ్యానికి సంకేతమని చెప్పింది. చాలా దేశాలు.. ఈ వ్యత్యాసాలను గుర్తించే దిశలో ఉన్నాయని వెల్లడించింది. 
  • దేశంలోని వివిధ మతాలకు మత చట్టాలున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన ఆవశ్యకతను పరిశీలించాలని, ఉమ్మడి పౌరస్మృతికి ఇది తగిన సమయమో కాదో చెప్పాలని 2 సం॥ల క్రితం కేంద్ర ప్రభుత్వం న్యాయ కమిషన్‌ను కోరింది.
  • 3 సం॥ల పదవీకాలాన్ని 2018 ఆగస్టు 31తో ముగించుకున్న 21వ న్యాయకమిషన్‌ ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికను కాకుండా సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే బాధ్యత 22వ న్యాయకమిషన్‌పై పడింది.
  • ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలన్నది అధికార బీజేపీ సైద్ధాంతిక వైఖరి. ఆ పార్టీ ఎన్నిక హామీలోనూ ఈ అంశం ఉంది. చాలా మైనార్టీ వర్గాలు దీన్ని వ్యతిరేకించాయి. తమ సాంస్కృతిక, మతపరమైన గుర్తింపును తుడిచివేయడానికి జరుగుతున్న ప్రయత్నంగా అవి భావిస్తున్నాయి.
  • ఈ అంశం దేశవ్యాప్తంగా వాడి వేడి చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎస్‌.చౌహాన్‌ నేతృత్వంలోని న్యాయకమిషన్‌ తన పత్రంలో స్పందిస్తూ  ‘‘ఉమ్మడి పౌర స్మృతి అంశం విస్తృతమైనది. ఈ స్మృతితో రాగ పర్యవసానాు ఎలా ఉంటాయో తెలియదు.
  • దేశంలో వైరుద్ధ్యం లేకుండా చూడడమంటే అసు వ్యత్యాసాలే లేకుండా చేయడం కాదు. అందుకే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలన్న అంశంపై కాకుండా వివక్షపూరితంగా ఉన్న చట్టాలపై దృష్టి పెట్టాం.’’ అని పేర్కొంది.
  • ఈ కారణంగానే రెండేళ్లుగా పలువురితో సంప్రదింపులు జరిపి, వివరంగా పరిశోధించిన తర్వాత భారత్‌లో కుటుంబ చట్టాల సంస్కరణ ఆవసరంపై ఈ పత్రం సమర్పిస్తున్నట్లు తెలిపింది. స్త్రీ-పురుష వ్యత్యాసాన్ని, వివక్షను కనబర్చే చట్టాలపై దృష్టిసారించడం ముఖ్యమని చెప్పింది.
  • వివాహ చట్టం, విడాకులు, మనోవర్తి, స్త్రీ-పురుషుల వివాహ వయస్సుకు సంబంధించిన చట్టాల్లో మార్పు చేయాలని సూచించింది. లౌకికవాద ప్రజాస్వామ్యంలో మత స్వేచ్ఛను గట్టిగా పరిరక్షించాల్సిందేనని, అదే సమయంలో మతాచారా పేరుతో ముమ్మారు తలాక్‌, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతలను అనుమతించరాదని స్పష్టం చేసింది. 
  • మహిళలకు సమాన హక్కుపై న్యాయకమిషన్‌ స్పందిస్తూ కుటుంబంలో మహిళ పాత్రను గుర్తించాలంది. విడాకులు తీసుకునే పక్షంలో ఆమె సంపాదనతో సంబంధం లేకుండా పెళ్లయిన తర్వాత సమకూర్చుకున్న ఆస్తిలో ‘సమానవాటా’ దక్కాలని అభిప్రాయపడింది.
  • సమ భాగమంటే ఆస్తిని నిక్కచ్చిగా సగం సగం చేసి పంచడమని కాదని, ఇలా చేస్తే చాలా కేసుల్లో దంపతుల్లో ఒకరిపై అన్యాయంగా భారం పడొచ్చని పేర్కొంది. 
  • ఈ మార్పు కోసం హిందూ వివాహ చట్టం-1955, ప్రత్యేక వివాహ చట్టం-1954, పార్శీ వివాహ చట్టం, విడాకుల చట్టం(క్రైస్తవు కోసం), ముస్లిం వివాహాల రద్దు చట్టాల్లో సవరణ తీసుకురావచ్చని పేర్కొంది.
  • ‘‘పెళ్లయిన తర్వాత చాలా మంది ఆడవాళ్లు కుటుంబం కోసం కెరియర్‌ను త్యాగం చేస్తారు. ఇంటిపనిలో ఎక్కువ భారం వారే మోస్తారు. అయినా ఆ పనిని డబ్బు రూపంలో కొలిచి చూడరు.
  • ఆడవాళ్లు గర్భం దాల్చడంతో వారి కెరియర్‌కు అంతరాయం కలుగుతుంది. కానీ భర్త కెరియర్‌పై ప్రభావం ఉండదు. అందుకే భార్య సంపాదించినా సంపాదించకపోయినా ఈ అంశాన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. పెళ్లయిన తర్వాత కుటుంబానికి సమకూరే ఆదాయంలో ఆమెకూ సమాన వాటా ఇవ్వాలి.  
  • దీనర్థం.. వారసత్వంగా వచ్చే ఆస్తికీ ఈ పంపకం వర్తిస్తుందని కాదు. అయితే వారసత్వంగా వచ్చే ఆస్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుని నిర్వహణఖర్చును, మనోవర్తిని నిర్ణయించవచ్చు.’’ అని పేర్కొంది. 
  • పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన కనీస వయోపరిమితి స్త్రీ-పురుషులిద్దరికీ సమానంగా ఉండాని, ఇద్దరికీ 18 ఏళ్ల వయస్సునే నిర్ధారించాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వయోపరిమతి పురుషులకు 21 సంవత్సరాలు, మహిళలకు 18 ఏళ్లుగా ఉంది.
  • ఓటు హక్కు వయస్సు ఇద్దరికీ ఒకేలా ఉన్నప్పుడు, ప్రభుత్వాలను ఎన్నుకునే విచక్షణ వారికి ఉందని విశ్వసించినప్పుడు.. తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే సామర్థ్యమూ వారికి ఉంటుంది అని పేర్కొంది. 
  • హిందూ వివాహ చట్టంలోని వైవాహిక హక్కుల్లో మార్పు, అక్రమ సంతానానికి సమానహక్కు వంటి అంశాలను చర్చించింది. ముస్లిం చట్టంలోని వారసత్వ హక్కు గురించి చర్చించింది.
  • ఈ నిబంధనను క్రోడీకరించాలని సూచించింది. అయితే స్త్రీ-పురుష వ్యత్యాసం లేకుండా ఈ క్రోడీకరణ ఉండాలంది. పార్శీ మహిళలు అన్య వర్గాల వారిని పెళ్లి చేసుకున్నా వారికి వారసత్వ ఆస్తిలపై హక్కుండాలన్న అంశంపై, వితంతువు హక్కులపై చర్చించింది.
  • బాలల న్యాయ (సంరక్షణ) చట్టాన్ని బలమైన లౌకిక చట్టంగా మార్చాలంది. అన్ని వర్గాల వారు పిల్లలను దత్తత తీసుకోవడానికి వీలు కల్పించేలా ఈ చట్టం ఉండాలని సూచించింది. దత్తతకు మార్గదర్శకాలను సవరించాలని చెప్పింది.
  • పిల్లల సంరక్షణ విషయాలను నిర్ణయించేటప్పుడు మతచట్టాలతో సంబంధం లేకుండా వారి ప్రయోజనాలే పరమావధిగా ఉండాలని స్పష్టం చేసింది. 
  • బహు భార్యాత్వం, నిఖా హలాలా, విడాకులు తీసుకునే పార్శీ మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చే అంశం, వివాహేతర సంబంధాలు తదితరఅంశాలు సుప్రీంకోర్టు పరిశీనలో ఉన్నందున వాటిపై న్యాయకమిషన్‌ పత్రంలో చర్చించినా వాటిల్లో కొన్నింటికి సమగ్ర మార్పును సూచించలేదు.
న్యాయకమిషన్‌ ప్రధాన సూచనలు 
  • పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా వయోపరిమితి ఉండకూడదు. ఈ విధానాన్ని రద్దు చేయాలి. ఇద్దరికీ కనీస వయోపరిమితిని 18 ఏళ్లుగానే నిర్ధారించాలి.
  • పెళ్లిచేసుకునే దంపతులు అన్ని విధాలా సమానమే. అబ్బాయిలకు 21ఏళ్లు, అమ్మాయికి 18ఏళ్లు ఉండాలనడమంటే భర్తకన్నా భార్యలు వయస్సులో చిన్నవారై ఉండాలన్న సాధారణాచారాన్ని బలపర్చడమే.
  • విడాకుల ప్రక్రియ సరళతరంగా ఉండేలా చూడాలి. దంపతుల మధ్య రాజీ సాధ్యం కాని పరిస్థితుల్లో విడాకుల ప్రక్రియను సరళతరం చేయడం వల్ల పరస్పరం తప్పుడు ఆరోపణలు చేసుకోకుండా నియంత్రించవచ్చు. విడాకుల ప్రక్రియ తొందరగా పూర్తి కావడానికి చాలా కేసుల్లో తప్పుడు ఆరోపణలు చేసుకుంటుంటారు.
  • పెళ్లయిన తర్వాత దంపతుల్లో ఎవరు ఆస్తిని సమకూర్చినా దాన్ని దంపతుల ఉమ్మడి ఆస్తిగానే పరిగణించాలి. విడాకులు తీసుకునే పక్షంలో ఆమెకు ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలి.

views: 865

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams