Current Affairs Telugu Daily

తిరుపతిలో స్వీకార్‌ సెంటర్‌కు భూమిపూజ
తిరుపతిలో టాటా ట్రస్టు, అలమేలు ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 25 ఎకరాల్లో నిర్మితమయ్యే 376 పడకల శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ కేర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(స్వీకార్‌) సెంటర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టాటా ట్రస్టు ఛైర్మన్‌ రతన్‌టాటాతో కలిసి 2018 ఆగస్టు 31న భూమిపూజ చేశారు.
  • స్వీకార్‌ను టీటీడీ అందించిన 25 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.600 కోట్లతో నిర్మాణం కానుంది. మెడికల్‌ అంకాజీ, సర్జికల్‌ అంకాజీ, రేడియేషన్‌ అంకాజీ సేవలను పూర్తిస్థాయిలో అందిస్తారు.
  • ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్టీఆర్‌ వైద్యసేవ, ఎన్టీఆర్‌ ఆరోగ్యరక్ష, కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయుష్మాన్‌భవ కార్యక్రమాల ద్వారా రోగులకు ఉచితంగా వైద్యసేవలను ఈ ఆసుపత్రిలో అందిస్తారు.
  • మిగిలిన వారికి తక్కువ ధరలో సేవలు అందనున్నాయి. క్యాన్సర్‌ పరిశోధనను అంతర్జాతీయ సంస్థతో కలిసి టాటాట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్వీకార్‌ చేపట్టనుంది. అమెరికాతో పాటు ప్రముఖ వైద్యసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

views: 802

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams