Current Affairs Telugu Daily

ఖాట్మండ్‌లో బిమ్‌స్టెక్‌ 4వ సదస్సు 
అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఉగ్రవాదం పెనుముప్పని బిమ్‌స్టెక్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్రవాదానికి మద్దతునిస్తూ, అందుకు నిధులు సమకూరుస్తూ, సురక్షిత స్థావరాలు కల్పిస్తున్న దేశాలు, సంస్థను గుర్తించి వాటిని బాధ్యులను చేయాలని పిలుపునిచ్చాయి.
  • బిమ్‌స్టెక్‌ 4వ సదస్సు ముగింపు సందర్భంగా 2018 ఆగస్టు 31న ఈ దేశాలు సంయుక్తంగా ఖాట్మండ్‌ ప్రకటనను విడుదల చేశాయి. బిమ్‌స్టెక్‌ దేశాల్లో సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను ఈ ప్రకటన ఖండించింది.
  • ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడడం, ఆయా దేశాలు తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా నియంత్రించడం తదితర చర్యల ద్వారా అన్ని దేశాలు సమగ్ర వైఖరిని అవలంబించాలని కోరింది.
  • బిమ్‌స్టెక్‌ కూటమిలో సభ్య దేశాలు ` భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, భూటాన్‌, నేపాల్‌. బిమ్‌స్టెక్‌ను మరింత బలోపేతం చేయడానికి, ఫలితాలు సాధించే సంస్థగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలన్న ప్రతినను సభ్య దేశాలు పునరుద్ఘాటించాయి.
  • ఈ ప్రాంతంలో పేదరిక నిర్మూలన పెద్ద సవాలని అంగీకరిస్తూ సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండా అమలుకు కలిసికట్టుగా పని చేయాలని తీర్మానించాయి.
  • సదస్సు ముగింపు సందర్భంగా నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి ఛైర్మన్‌ పదవిని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు అప్పగించారు. సభ్య దేశాల మధ్య ఇంధన సహకారం కోసం బిమ్‌స్టెక్‌ గ్రిడ్‌ ఇంటర్‌కనెక్షన్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
BIMSTEC- Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation

views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams