Current Affairs Telugu Daily

తెలంగాణలో రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో 2018 ఆగస్టు 31 నుంచి రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.
  • 2018 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని డీటీసీపీ భవనంలో రెరా ప్రాధికార సంస్థ(అథారిటీ) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. రెరా అథారిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, కార్యదర్శిగా డీటీసీపీ విద్యాధర్‌ ఉన్నారు.
  • 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొంది రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన ప్రాజెక్టు 4947గా ప్రకటించారు. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2985 ఉండగా, హెచ్‌ఎండీఏ పరిధిలో 640, డీటీసీపీ పరిధిలో 1122 ఉన్నాయి.
  • కొనుగోలుదారులు ఫిర్యాదు చేయాలనుకుంటే రెరా అథారిటీ వెబ్‌సైట్‌ ద్వారా చేయొచ్చు. ఫిర్యాదు సమయంలో రూ.1000 ఫీజు చెల్లించాలి.
RERA-Real Estate RegulatoryAuthority

views: 905

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams