Current Affairs Telugu Daily

స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయించే 6 కార్యాలయాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంలో స్థానిక రిజర్వేషన్ల నుంచి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయం, సంస్థ, రాష్ట్ర స్థాయి కార్యాలయం, సంస్థలను కేంద్ర ప్రభుత్వం మినహాయించగా, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధన 1975 నుంచి అమలులో ఉంది.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో అక్టోబరు 18న 371-డి అధికరణలోని 1, 2వ క్లాజ్‌ కింద జారీ చేసిన జీఎస్‌ఆర్‌ 524(ఇ) ఉత్తర్వులను జారీ చేసింది. ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ రక్షణ కోసం 32వ రాజ్యాంగ సవరణతో 371-డిని రాజ్యాంగంలో పొందుపరిచారు.
  • దీనికింద అన్ని ప్రాంతాల వారికి ప్రభుత్వ విద్య, ఉద్యోగ రంగాల్లో సమన్యాయం కల్పించాలని నిర్దేశించారు. స్థానికత, రిజర్వేషన్లు, ఇతర అంశాలపై ఇందులో 14 పేరాలు ఉన్నాయి.
14వ పేరాలోని అంశాలు...
  • స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయించే 6 కార్యాలయాలను 14వ పేరాలో పేర్కొన్నారు. ఇందులో (ఎ) సచివాలయం, (బి) శాఖాధిపతుల కార్యాలయం, (సి) రాష్ట్రస్థాయి కార్యాలయాలు, (డి) ప్రత్యేక కార్యాలయాలు సంస్థలు, (ఇ) భారీ అభివృద్ధి ప్రాజెక్టు (ఎఫ్‌) హైదరాబాద్‌ సిటీ పోలీసు జోన్‌ అని పేర్కొన్నారు.
  • రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ ఈ కార్యాలయాల్లో సమానావకాశాలు కల్పించేందుకు దీనిని నిర్దేశించారు. 
  • ఆంధ్రప్రదేశ్‌ వారికి అవకాశాలు కల్పించేందుకు దీనిని ఉద్దేశించారని దీనిపై తెలంగాణ ప్రాంతం వారినుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం 1975 నవంబరులో మరో ఉత్తర్వులను జారీ చేసింది.
  • ఇందులో సచివాలయం, రాష్ట్రాధిపతుల కార్యాలయాల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 12.5 శాతం మందిని సమన్యాయం (ఫేర్‌షేర్‌) ప్రాతిపదికన అన్ని ప్రాంతాల నుంచి తీసుకోవాలని సూచించింది.
  • దీనికి అనుగుణంగా జిల్లా నుంచి 12.5 శాతం మందిని జిల్లాల నుంచి తొలుత శాఖాధిపతుల కార్యాలయాల్లోకి తీసుకొని, అక్కడి నుంచి సచివాలయంలో నియమించే విధానం అమలవుతోంది. 
  • 2009లో 14(ఎఫ్‌)లో సిటీ పోలీసు నియామకాల సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టారు. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీనిపై చర్చించి ఈ నిబంధన రద్దుకోసం కేంద్రాన్ని కోరగా, దానిని రాష్ట్రపతి రద్దు చేశారు.
  • తర్వాత 14వపేరాలో అయిదు కార్యాయాలు మిగిలాయి. రాష్ట్రప్రభుత్వం కొత్త జోనల్‌ విధానం కింద దీనిపై చర్చించి ఏ,బీ,సీ,డీ కింద కార్యాలయాలను కొనసాగిస్తూ ఇ కింద గల ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టును తొలగించింది.
  • 4 కేటగిరీలోని కార్యాలయా పరిధిలో ప్రస్తుతం లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 204 శాఖాధిపతుల కార్యాలయాలుండగా వాటిల్లో 65 వేల మంది ఉద్యోగున్నారు.
  • సచివాలయంలో 2వేల మంది, రాష్ట్రస్థాయి, ప్రత్యేక కార్యాలయాల్లో మరో 18 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 
  • సచివాలయంలో ప్రస్తుత విధానంలో సహాయ విభాగాధికారి(ఏఎస్‌వో) నియామకాలు జరుగుతున్నాయి. మిగిలిన విభాగాధికారులు, సహాయ కార్యదర్శుల, ఉప కార్యదర్శుల, సంయుక్త, అదనపు కార్యదర్శుల వంటి పోస్టులన్నింటినీ పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు.
  • డ్రైవర్లు, సబార్డినేట్లు ఇతర సిబ్బందిని మొదట్లో ఉపాధి కల్పన కార్యాలయాల నుంచి తీసుకున్నారు. కారుణ్య నియామకాలు మినహా గత 3 దశాబ్దాల నుంచి కిందిస్థాయి సిబ్బందిని తీసుకోవడం లేదు. ఒప్పంద, పొరుగు సేవ విధానం కింద తాత్కాలిక నియామకాలు జరుపుతున్నారు. 
  • శాఖాధిపతుల కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంటు స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. వారికి దశ వారీగా పదోన్నతులు ఇస్తూ సీనియర్‌ అసిస్టెంటు, సూపరింటెండెంటు, సహాయ సంచాలకుల, డీడీ, జేడీ, అదనపు సంచాలకుల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
కొత్త విధానంలో.. 
  • కొత్త జోనల్‌ విధానంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలను మినహాయించినందుకు 95 శాతం స్థానిక, 5 శాతం ఓపెన్‌ కోటా రిజర్వేషన్లు వర్తించవు.
  • ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే వీటిని రాష్ట్రమంతటికీ చెందిన అభ్యర్థులతో ఓపెన్‌ కోటా కింద భర్తీ చేయాలి. కాకపోతే కొత్త విధానంలో ఒక వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
  • దీనికింద ఈ కార్యాలయాల నుంచి రిజర్వేషన్లు వర్తించే జిల్లా కార్యాలయాల నుంచి పరస్పర బదిలీలు కల్పించాలని నిర్ణయించింది. దీనిద్వారా జిల్లా నుంచి సచివాలయం, సచివాలయం, ఇతర రాష్ట్ర కార్యాలయాల నుంచి జిల్లా, జోనల్‌ కార్యాలయాలకు బదిలీలు జరపవచ్చు.
  • విద్య, ఉద్యోగ నియామకాల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించే నిబంధను అమలులో ఉన్నాయి. స్థానికతకు నిర్వచనాలను దీనికి అనుగుణంగా ఇస్తున్నారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో వచ్చిన 371-డి ఆధారంగా జిల్లా, జోనల్‌ నియామకాల్లో 80:20, 70:30 స్థానిక, స్థానికేతర రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది.
  • రాష్ట్రస్థాయి నియామకాల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. రాష్ట్రానికి చెందినవారు లేదా ఇతర రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగాక ఏపీ నుంచి విడిపోయి కొత్తరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తాజాగా కొత్త విధానాన్ని రూపొందించి కేంద్రానికి సిఫార్సు చేయగా ఆమోదం లభించింది.
  • దీని ప్రకారం జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక, 5 శాతం ఓపెన్‌ కోటా విధానం అమలు కానుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో 15 శాతం, కేరళలో 50 శాతం స్థానికేతర రిజర్వేషన్లు అమలులో ఉన్నా.. ఆయా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులైతేనే రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ నిబంధన వల్ల స్థానికులే అవకాశాలు పొందుతున్నారు.
  • కొత్త జోన్లను నోటిఫై చేస్తూ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో చిన్న తప్పును సవరిస్తూ కేంద్ర హోంశాఖ 2018 ఆగస్టు 31న ఉత్తర్వులు  జారీచేసింది. 2018 ఆగస్టు 29వ తేదీతో జారీ అయిన నోటిఫికేషన్‌(జీఎస్‌ఆర్‌820-ఇ)లోని 14వ పేజీలో షెడ్యూల్‌ అన్న పదం కింద ‘పేరా గ్రాఫ్‌ 2(బి), (జి), (హెచ్‌), (ఎల్‌)చూడండి’ అని సూచిక ఇచ్చారు.
  • ఇందులో బి అంటే జిల్లా, జి అంటే మల్టీజోన్‌, హెచ్‌ అంటే షెడ్యూల్‌, ఎల్‌ అంటే స్టేట్‌లెవెల్‌ ఆఫీస్‌ లేదా ఇన్‌స్టిట్యూషన్‌ అని అర్థం. అందులో ఇప్పుడు ‘ఎల్‌’ అనే సూచికను తొలగించి, దాని స్థానంలో ‘2(ఎం)’ చేర్చారు. ఇది జోన్‌ను సూచిస్తుందని పేర్కొన్నారు.

views: 936

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams