Current Affairs Telugu Daily

ఒక రాష్ట్ర ఎస్సీ, ఎస్టీలు మరో రాష్ట్రంలో రిజర్వేషన్లు పొందలేరు : సుప్రీంకోర్టు 
ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీలు మరో రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగం, విద్యాసంస్థల్లో ప్రవేశాల నిమిత్తం తమ కోటా కింద ప్రయోజనాలను పొందాలంటే అక్కడా ఆయా సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తిస్తూ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2018 ఆగస్టు 30న ఈ విషయం తేల్చిచెప్పింది. ప్రయోజనాన్ని పొందగోరుతున్న రాష్ట్రంలో ఆయా కులాలను   సంబంధిత జాబితాలో చేర్చకపోతే మాత్రం రిజర్వేషన్‌ను పొందలేరని వివరించింది.
  • ‘ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ జాబితాలోని వ్యక్తి తన చదువు, లేదా ఉద్యోగావసరార్థం ఇతర రాష్ట్రాలకు వెళ్తే అక్కడా ఎస్సీకి చెందిన వ్యక్తిగాలనే భావించడం కుదరదు. అలాంటివారు అక్కడ స్థానిక ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన కోటాను తినేయడం తగదు.
  • ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఉన్న వ్యక్తి దానిని ప్రాతిపదికగా చూపించి మహారాష్ట్రలో అదే హోదాను కోరలేరు. అలా లబ్ధి కల్పించడమంటే మహారాష్ట్రలోని స్థానిక ఎస్సీ/ ఎస్టీ సభ్యులని అవకాశాన్ని తోసిపుచ్చడమే’ అని తెలిపింది.
  • ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ ఎం.శాంతనగౌడర్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ కేంద్ర రిజర్వేషన్‌ విధానం దిల్లీకి సంబంధించినంత వరకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం 4:1 ఆధిక్యంతో పేర్కొంది.
  • జస్టిస్‌ బానుమతి మాత్రం ఈ అభిప్రాయంతో విభేదించారు. ఒక రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి- మరో రాష్ట్రంలో తమ కులాన్ని ఆ జాబితాలో చేర్చకపోయినా రిజర్వేషన్‌ ప్రయోజనాన్ని పొందవచ్చా అనే అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం తీర్పు వెలువడింది.
  • రాష్ట్రపతి రూపొందించే ఎస్సీ, ఎస్టీ జాబితాదే పైచేయి అనీ, దానిలో మార్పు చేర్పు చేయాల్సిందిగా న్యాయస్థానాలు సహా ఎవరూ ఆదేశించజారని తేల్చిచెప్పింది.

views: 796

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams