Current Affairs Telugu Daily

ఆసియా క్రీడల్లో భారత్‌
2018 జకార్త ఆసియా క్రీడల్లో భారత్‌కు 2018 ఆగస్టు 26న 3 రజతాలు, 2 కాంస్యాలు కూడా దక్కాయి.
  • దీంతో పతకాల పట్టికలో 9 స్వర్ణాలు సహా 50 పతకాలతో 8వ స్థానంలో ఉంది. ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారి టేబుల్‌ టెన్నిస్‌ పతకం గెలుచుకుంది.
  • టీమ్‌ విభాగంలో కాంస్యం చేజిక్కించుకుంది. సతియన్‌, ఆచంట శరత్‌ కమల్‌, ఆంథోనీ అమల్‌రాజ్‌తో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయం పాలైంది. టీటీ సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్య పతకాలు ఇస్తారు.
  • సింధు ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తండ్రి, తనయగా పి.వి.రమణ, సింధు చరిత్ర సృష్టించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత వాలీబాల్‌ జట్టులో రమణ కీలక ఆటగాడు.
  • అప్పుడు రమణ కాంస్యం సాధించగా.. ఇప్పుడు సింధు రజతం గెలిచి తండ్రిని మించిన తనయగా సరికొత్త రికార్డు సృష్టించింది.
  • సింధు- రమణ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. 2000లో రమణకు అర్జున అవార్డు దక్కగా.. 2013లో సింధుకు అర్జున పురస్కారం లభించింది. 

views: 1003

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams