Current Affairs Telugu Daily

అంగారకుడి కక్ష్యలో మన ఉపగ్రహానికి వెయ్యి రోజులు 
భారత్‌ మొట్టమొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారకుడి వద్దకు పంపిన మంగళయాన్‌ ఉపగ్రహం సోమవారం ఆ గ్రహ కక్ష్యలో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు పాటు అది దిగ్విజయంగా పనిచేయడం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సామర్థ్యానికి గీటురాయి. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని 2013 నవంబర్‌ 5న ఇస్రో ప్రయోగించింది. మరుసటి ఏడాది సెప్టెంబర్‌ 24న అది అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. నిజానికి ఆరు నెలలే పనిచేస్తుందని భావించారు. అయితే అంచనాలకు మించి.. ఇప్పటికీ ఇది అద్భుతంగా సేవలు అందిస్తోంది. అంగారకుడిని 388 సార్లు చుట్టి వచ్చింది. ఆ గ్రహం మీదున్న రోజు నిడివి ప్రకారం చూస్తే 973 రోజులను పూర్తి చేసుకుంది.
views: 994

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams