Current Affairs Telugu Daily

నాన్‌ రెసిడెన్షియల్‌ ప్లేస్కూళ్ల ఏర్పాటు
ప్రస్తుతం గురుకులాల్లో ఐదో తరగతిలో చేరుతున్న విద్యార్థుల్లో ప్రమాణాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పైలెట్‌ ప్రాజెక్టు కింద నాన్‌ రెసిడెన్షియల్‌ ప్లేస్కూళ్లను ప్రారంభించాలన్న ఆలోచన చేసింది. అందుబాటులో ఉన్న ఖాళీ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేసుకోనుంది. కొన్ని ప్రాంతాల్లోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు 50కి మించి ఉండడం లేదు. దీంతో ఆయా వసతి గృహాలను అలాగే కొనసాగిస్తూ, ఉదయం వేళల్లో పాఠశాలలు నిర్వహించనుంది. వసతిగృహమున్న గ్రామంలోని విద్యార్థులకు ఈ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. కనీసం 30-40 మంది విద్యార్థులు చేరినా, వసతి గృహ నిర్వహణకు చేస్తున్న ఖర్చులకు న్యాయం చేసినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. 
views: 1063

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams