ఎఫ్‌-16 తయారీకి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌
అత్యాధునిక ఎఫ్‌-16 బ్లాక్‌ 70 యుద్ధ విమానాలను భారత్‌లో తయారు చేయడానికి అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌) చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా తదితరుల సమక్షంలో ఒప్పందంపై టీఏఎస్‌ఎల్‌ సీఈఓ సుకరాన్‌ సింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (వ్యూహాలు, వ్యాపారాభివృద్ధి) జార్జి స్టాండ్‌రిడ్జ్‌ సంతకాలు చేశారు. పారిస్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కలిసేందుకు కొద్ది రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్‌ వెళుతున్న తరుణంలో ఈ ఒప్పందం కుదరడం విశేషం. భారత వాయు సేనకు ఏక ఇంజిన్‌ ఫైటర్ల అవసరం చాలా ఉంది. కొత్తతరం ఎఫ్‌-16 బ్లాక్‌ 70 యుద్ధ విమానాలు ఈ అవసరాన్ని తీర్చగలవు. మేకిన్‌ ఇండియాలో భాగంగా రక్షణ ఆయుధాలు, పరికరాలు, ఇతర సామాగ్రిని భారత్‌లో తయారు చేసే సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యాన్ని ఇది నెరవేర్చగలదని లాక్‌హీడ్‌ మార్టిన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం ఫోర్ట్‌వర్త్‌, టెక్సాస్‌లోని ప్లాంట్‌ను లాక్‌హీడ్‌ భారత్‌కు తరలిస్తుంది. భారత రక్షణ రంగం నుంచి కోట్ల డాలర్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఆర్డర్లు పొందడానికి లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఎఫ్‌-16 విమానాల తయారీని భారత్‌లో చేపడుతోంది
views: 734

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams