Current Affairs Telugu Daily

కథకులు వేదగిరి రాంబాబు మృతి
ప్రముఖ కథకులు వేదగిరి రాంబాబు 2018 ఆగస్టు 18న హైదరాబాద్‌లో మృతి చెందారు. తెలుగు కథలకు ప్రాచుర్యం కల్పించడంలో అహర్నిశలు శ్రమించారు.
  • గురజాడ ఇంటిని కూడా ఆధునికీకరించారు. గిడుగు రామ్మూర్తి పుస్తకాలను పునర్ముద్రించారు. ఇటీవల అప్పాజోష్యుల పురస్కారం లభించగా అనారోగ్యంతో స్వీకరించలేకపోయారు.
  • ఆయన రచించిన ‘జైలు గోడలమధ్య’ పుస్తకాన్ని అదే శీర్షికతో షార్ట్‌ఫిల్మ్‌గా తీసి  ప్రేక్షకుల మన్ననలు పొందారు. పాపం పసిపిల్లలు, ఇతరత్రా షార్ట్‌ఫిల్మ్‌లకుగాను ఆయనకి 3నంది పురస్కారాలు లభించాయి.
  • ఇంద్రధనస్సుపేరుతో వచ్చిన బాలల తొలి వీడియో మ్యాగజైన్‌కు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. వంద కథానికలకు సంబంధించి సమగ్ర సమాచారంతో ఆయన తెలుగుకథానిక.కామ్‌ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
  • ఆయన నిర్మించిన ‘అడవి మనిషి’ ధారావాహికలకు రజత నంది పురస్కారం లభించింది. 

views: 888



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams