Current Affairs Telugu Daily

దేశానికి ఎక్ట్రానిక్‌ ముప్పు లేకుండా చేసే ఈఎంపీ స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి 
రక్షణ పరంగా దేశం ఎలక్ట్రానిక్‌ ముప్పును ఎంత సమర్థంగా ఎదుర్కోగలమో సాంకేతికంగా సమీక్షించుకోడానికి రూ.25కోట్ల భారీ వ్యయంతో  ‘ఎలక్ట్రో మాగ్నటిక్‌ పల్స్‌- ఈఎంపీ’ అనే వ్యవస్థను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ పరిధిలోని పరిశోధనా సంస్థ సమీర్‌ స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంది.
  • సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతులు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి శత్రువు నుంచి పొంచి ఉండే ముప్పుల్లో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను నాశనం చేయడం.. లేదా స్తంభింపజేయడం కూడా ఒకటి. ప్రపంచంలోని అతికొద్ది దేశాలే ‘ఎలక్ట్రో మాగ్నటిక్‌ పల్స్‌’ పరికరాన్ని అభివృద్ధి చేశాయి.
  • భారీ బాంబులు వేసినప్పుడు సాధారణంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్తు విస్తరిస్తుంది. దానిని విద్యుత్తు క్షేత్రంగా వ్యవహరిస్తాం.
  • అప్పుడు ఆ పరిధిలో ఉండే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లోని ఎలక్ట్రానిక్‌ వ్యవస్థన్నీ నాశనమైపోతాయి. ఈ పరిస్థితుల్లో మన రక్షణ పరికరాలు అలాంటి విపత్తులను తట్టుకునేలా ఉన్నాయో లేదో పరీక్షించేందుకు ఈ ఈఎంపీ పరికరం తోడ్పడుతుంది.
  • కంప్యూటర్ల నుంచి హెలీకాప్టర్ల వరకు వాటి ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ సామర్థ్యాన్ని సమీర్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ముంబయి కేంద్రంగా ప్రారంభమైన సమీర్‌కు కోల్‌కత, చెన్నైలో శాఖలుండగా 4వ కేంద్రాన్ని విశాఖపట్నంలో 2014లో ఏర్పాటు చేశారు.

views: 1021Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams