Current Affairs Telugu Daily

సినారె కన్నుమూశారు
జ్ఞాన‌పీఠ అవార్డు గ్రహీత డాక్ట‌ర్ సి. నారాయ‌ణ‌రెడ్డి క‌న్ను మూశారు.ఒక చిన్న ప‌ల్లెటూరిలోని సాధార‌ణ రైతు కుటుంబంలో జ‌న్మించిన సింగిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి స్వయంకృషితో అంచెలంచెలుగా సాహితీ ప్ర‌పంచంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. అత్యున్న‌త పుర‌స్కారం జ్ఞాన‌పీఠ అవార్డుతో పాటు మ‌రెన్నో అవార్డులందుకున్నారు. క‌వి, ర‌చ‌యిత‌, అధ్యాప‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యునిగా డాక్ట‌ర్ సినారె సేవ‌లు మ‌రువ‌లేనివి. 
నారాయణరెడ్డి 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో జన్మించారు.హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంచి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు పొందారు.
 కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సీనారే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ,మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి.

views: 1001



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams