Current Affairs Telugu Daily

సౌర కుటుంబం చుట్టూ హైడ్రోజన్‌ గోడ
సౌర వ్యవస్థ చుట్టూ అంతుచిక్కని హైడ్రోజన్‌ గోడ వ్యాపించి ఉందని నిరూపించే సరికొత్త ఆధారాన్ని తమ వ్యోమనౌక ‘న్యూ హారిజాన్స్‌’ గుర్తించిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
  • సౌర తుపానులో హైడ్రోజన్‌ అణువు భారీగా చిక్కుకుపోవడంతో ఈ గోడ ఏర్పడినట్లు వారు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సౌర కుటుంబం చుట్టూ హైడ్రోజన్‌ పొర ఉనికిని సూచించే ఆధారాలను వొయేజర్‌ వ్యోమనౌకు దాదాపు 30 ఏళ్ల క్రితమే గుర్తించాయి.
  • ఈ పొరను ‘హీలియోస్ఫియర్‌’గా చెబుతుంటారు. ఇందులోని హైడ్రోజన్‌ అణువు అతినీలోహిత కాంతి తరంగాలను విక్షణ రీతిలో ఉత్పత్తి చేస్తాయని నాసా శాస్త్రవేత్తులు తెలిపారు.
  • మరుగుజ్జు గ్రహం ప్లూటోను దాటి తన ప్రయాణాలన్ని కొనసాగిస్తున్న న్యూ హారిజాన్స్‌ వ్యోమనౌక.. ‘అలైస్‌’ అనే డిటెక్టర్‌ సాయంతో సదరు కాంతి తరంగాలను గుర్తించిందని వెల్లడించారు.

views: 1000



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams