Current Affairs Telugu Daily

తెలుగు ప్రముఖులకు రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు 
సంస్కృతం, పాళీ, ప్రాకృతం, అరబిక్‌, ప్రాచీన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషకు సేవలు అందిస్తున్న ప్రముఖులకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రశంసాపత్రం, మహర్షి బాదరాయణ్‌ వ్యాస్‌ సమ్మాన్‌ పురస్కారాలను ప్రకటించారు.
  • 2016, 2017, 2018 మూడు సంవత్సరాలకు ప్రకటించిన ఈ పురస్కారాల్లో పలువురు తెలుగువారికి చోటు దక్కింది.
రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు 
  • 2018: డాక్టర్‌ సముద్రాల వేంకట రంగ రామానుజాచార్యులు, ఆచార్య కృష్ణకాంతశర్మ, డాక్టర్‌ వంగీపురం నవనీతం వేదాంత దేశికన్‌ (సంస్కృతం), డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం (తెలుగు) 
  • 2017: ఆచార్య డాక్టర్‌ కె.వి.రామకృష్ణమాచార్యులు, భువనగిరి అనంతశర్మ, డాక్టర్‌ శ్రీష్టి లక్ష్మీనరసింహం, ఎస్‌.రామమూర్తి శాస్త్రి, ఆచార్య బి.నరసింహాచార్యులు (సంస్కృతం) 
  • 2016: శలాక రఘునాథశర్మ (తెలుగు), డాక్టర్‌ నెగెర్స్‌ డానియేల్‌ (తెలుగు-అంతర్జాతీయ)
మహర్షి బాదరాయణ్‌ వ్యాస్‌ సమ్మాన్‌ పురస్కారాలు 
2018: నంది మురళి (సంస్కృతం) 
2017: డాక్టర్‌ కందాళ కాదంబిని, డాక్టర్‌ రావూరి గాయత్రి మురళీ కృష్ణ (సంస్కృతం) 
2016: డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి  (తెలుగు)

views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams