Current Affairs Telugu Daily

60 ఏళ్ల క్రితం అపహరణకు గురైన బుద్ధ విగ్రహం భారత్‌కు అప్పగింత
60 ఏళ్ల క్రితం భారత్‌లోని ఓ ప్రదర్శనశాల నుంచి అపహరణకు గురై బ్రిటన్‌కు చేరిన 12వ శతాబ్దం నాటి గౌతమబుద్ధుడి విగ్రహాన్ని లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసు 2018 ఆగస్టు 15న భారత హై కమిషనరుకు తిరిగి అందచేశారు.
  • భారత స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ విగ్రహాన్ని అందచేసినట్లు లండన్‌ పోలీసులు వెల్లడించారు.
  • బిహారులోని నందలో ఉన్న ఆర్కియాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రదర్శనశాల నుంచి 1961లో 14 విగ్రహాలు అపహరణకు గురయ్యాయి.
  • చివరకు అవి లండన్‌ చేరాయి. అక్కడ నిర్వహిస్తున్న ఓ వేలంలో విగ్రహాలను చూసిన ఇండియన్‌ ప్రైడ్‌ ప్రాజెక్టు ప్రతినిధి పోలీసులను అప్రమత్తం చేయడంతో మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
  • ఇప్పుడు ఆ విగ్రహాల్లో నుంచి గౌతమబుద్ధుడిని భారత్‌కు అందచేసినట్లయింది.

views: 860



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams