Current Affairs Telugu Daily

మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పొట్నూరు సూర్యనారాయణ 2018 ఆగస్టు 15న  విశాఖపట్నంలో మృతి చెందారు.
  • సూర్యనారాయణ స్వగ్రామం గుర్ల మండలం పాలవలస. 1994లో సతివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • అంతకు ముందు గుర్ల మండలంలో గూడేం ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం అధ్యక్షునిగాను, పాలవలస పంచాయతీ సర్పంచిగా పనిచేశారు.
  • అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో సతివాడ నియోజకవర్గం రద్దు కావడం, అనంతర పరిణామాతో సూర్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 

views: 811



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams