Current Affairs Telugu Daily

తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్‌లోపి గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.
  • ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ గంటా పది నిమిషాలపాటు ప్రసంగించారు.
  • రైతు బీమా, బీసీలకు ఉచిత ఆర్థికసాయం పథకాలను ప్రారంభించారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఎస్‌.రాజేశ్వరి, చిప్పోలు నిర్మల, పోపల్లి స్వప్న, బారోతు లక్ష్మణరావు, ముద్దంగు శ్రీనివాస్‌కు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం పత్రాలను సీఎం అందించారు.
  • ఉత్తమసేవలందించిన సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి, అటవీశాఖ అదనపు ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి దోబ్రియాల్‌, మత్స్యశాఖ కమిషనర్‌ సి.సువర్ణ, రైతుబీమా పథకం కింద జి.శైలంకు పురస్కారాలను కేసీఆర్‌ అందజేశారు.
  • ఎస్‌ఐడీ డీఐజీ టి.ప్రభాకర్‌రావు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ డీఐజీ రాజేశ్‌కుమార్‌కు గ్యాంటరీ పోలీసు పతకాలను ప్రదానం చేశారు.
  • శాసనసభలో సభాపతి మధుసూదనాచారి, మండలిలో ఛైర్మన్‌ స్వామిగౌడ్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

views: 860

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams