Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
శ్రీకాకుళంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.
  • అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెగపూడిలోని రాష్ట్ర శాసనమండలిలో మండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, శాసనసభలో సభాపతి కోడె శివప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ మువ్వన్నెల విద్యుత్తు కాంతులతో వెలిగిపోయింది.
  • కృష్ణా పుష్కరాల సమయంలో ప్రకాశం బ్యారేజీకి రంగురంగు విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశారు.
  • ఈ విద్యుత్తు కాంతుల్లో 20 నిమిషాలకు ఒకసారి జాతీయ పతాకపు మూడు రంగుల వెలుగులు బ్యారేజి గేట్లపై తళుకులీనుతూ కనువిందు చేశాయి.

views: 856



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams