గుజరాత్లో నర్మదానదిపై ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం ఐదున్నర దశాబ్దాల తరువాత ఎట్టకేలకు పూర్తయ్యింది.
1961లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ నాయకత్వంలోని నర్మదా బచావో అందోళన్ (ఎన్బీఏ) వల్ల తీవ్రమైన అవరోధం ఏర్పడింది. పర్యావరణ, పునరావాస సమస్యలపై ఎన్బీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తేవడంతో డ్యామ్ పనులు 1996లో ఆగిపోయాయి. 2000లో సుప్రీంకోర్టు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చాక నిర్మాణ పనులను పునరుద్ధరించారు.
views: 1264