Current Affairs Telugu Daily

స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో తెలుగు రైల్వే స్టేషన్లు 
స్వచ్ఛ రైల్వేలో తెలుగు రాష్ట్రాలు సత్తాచాటాయి. జోన్‌ పరంగా, స్టేషన్ల పరంగా రెండు రాష్ట్రాల్లోని వివిధ స్టేషన్లు ఏ1, ఏ కేటగిరీ స్టేషన్ల ర్యాంకుల్లో దూసుకుపోయాయి.
  • ఏ1 కేటగిరీలో తొలి 10 ర్యాంకుల్లో 5, ఏ కేటగిరీలో 3 ర్యాంకులు దక్కాయి. జోన్‌పరంగా దక్షిణమధ్య రైల్వే 2వ ర్యాంకు కైవసం చేసుకొంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేషన్ల పరిశుభ్రతపై క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన 2018 సర్వే నివేదికను కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ 2018 ఆగస్టు 13న విడుదల చేశారు.
  • అత్యధిక ర్యాంకును ఉత్తర మధ్య రైల్వే(నార్త్‌సెంట్రల్‌ రైల్వే/ఎన్‌సీఆర్‌), దక్షిణ మధ్య రైల్వే(సౌత్‌సెంట్రల్‌ రైల్వే/ఎస్‌సీఆర్‌) జోన్‌లు దక్కించుకున్నాయి.
  • ఏ- విభాగంలో పనితీరు మెరుగుపరుచుకున్న స్టేషన్లు 
కర్నూలు 4వ స్థానం (361 స్కోర్‌తో) 
గుంటూరు 10వ స్థానం (306.1స్కోర్‌తో) 
  • జోన్లవారీగా గత ఏడాది 4వ స్థానంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే ఈసారి 2వ ర్యాంకు కైవసం చేసుకొంది.
  • మొత్తం 100 మార్కుల్లో ప్రాసెస్‌ ఎమ్యాషన్‌, ప్రత్యక్ష పరిశీన, ప్రజల ఫీడ్‌బ్యాక్‌కు 33.33% మార్కు చొప్పున కేటాయించి ర్యాంకు ప్రకటించారు.
  • గత ఏడాదితో పోలిస్తే స్టేషన్లలో 17.6% మేర పారిశుద్ధ్యం మెరుగుపడింది. 
  • ఏ-1 విభాగంలో స్టేషన్లలో సగటున 17%,  ఏ కేటగిరీ స్టేషన్లలో 18% మేర పరిస్థితులు మెరుగుపడ్డాయి. 
  • స్టేషన్‌ అధికారులు ఈ ఏడాది పారిశుద్ధ్యం మెరుగునకు బాగా ప్రాధాన్యం ఇచ్చినట్లు సర్వేలో తేలింది. 
  • ఏ-1 విభాగంలో మొత్తం 75 ర్యాంకులకు గాను కాచిగూడ స్టేషన్‌ 14వ ర్యాంకులో నిలిచింది. 
  • ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి 69, దేశ రాజధాని డిల్లీ 39వ స్థానంలో నిలిచాయి 

views: 912

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams