Current Affairs Telugu Daily

దేశంలో అత్యుత్తమ 10 మంది సంపన్న మహిళల్లో స్మితా కృష్ణకు అగ్రస్థానం
దేశంలో అత్యుత్తమ 10 మంది సంపన్న మహిళల్లో స్మితా కృష్ణ (గోద్రేజ్‌ గ్రూప్‌), రోష్ని నాడార్‌ (హెచ్‌సీఎల్‌ టెక్‌), ఇందు జైన్‌ (బెనెట్‌ కోల్‌మన్‌)కు స్ధానం లభించింది.
  • 100 మంది మహిళా కుబేరులతో కోటక్‌ వెల్త్‌, హురున్‌లు ఈ జాబితాలను విడుదలు చేశాయి. మొదటి 10 మంది మహిళా సంపన్ను కనీస నికర ఆస్తి విలువ రూ.8,000 కోట్లు. గోద్రేజ్‌ గ్రూప్‌ మూడో తరం వారసురాలైన స్మితా కృష్ణ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.
  • ఆమె సంపద విలువ రూ.37,570 కోట్లు. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు సభ్యురాలైన ఆమె.. మొత్తం గ్రూప్‌లో అయిదింట ఒక వంతు వాటా కలిగి ఉంది.
  • 2014లో ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబాకు చెందిన బంగ్లాను రూ.371 కోట్లకు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. 
  • రెండో స్థానంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రోషిణి నాడార్‌ (సంపద రూ.30,200 కోట్లు) ఉన్నారు. 
  • రూ.26,240 కోట్ల నికర ఆస్తితో టైమ్స్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ ఇందు జైన్‌ మూడో స్థానంలో నిలిచారు. దేశంలో అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెనెట్‌ కోల్‌మన్‌కు ఆమె ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎకనామిక్‌ టైమ్స్‌, ఫెమినా వంటి పత్రికను ఈ సంస్థ కలిగి ఉంది.
  • బయోకాన్‌ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మజుందార్‌ షా రూ.24,790 కోట్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఇన్ఫోసిస్‌ బోర్డు సభ్యురాలు కూడా. 
  • ఐటీ దిగ్గజం శివ్‌ నాడార్‌ భార్య కిరణ్‌ నాడార్‌ అయిదో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి విలువ రూ.20,120 కోట్లు. శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 
  • భారత్‌లో మొదటి 100 మంది సగటు ఆస్తి రూ.4000 కోట్లు కాగా.. జాబితాలో రూ.1000 కోట్లు ఉన్నవారికే స్థానం లభించింది. 
  • రంగా వారీగా చూస్తే.. ఔషధ రంగం నుంచి 22 మంది మహిళలు ఉన్నారు. ఐటీ నుంచి 12 మంది, ఆహారం, శీత పానీయా రంగం నుంచి 8 మందికి స్థానం దక్కింది. 
  • ఇన్ఫోసిస్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ సంస్థకు చెందిన తలో 5 మంది ఈ జాబితాలో ఉన్నారు. 
  • ముంబయి, డిల్లీలకు చెందిన సంపన్న మహిళలు 25 చొప్పున ఉన్నారు. బెంగళూరు నుంచి 14 మంది కుబేరులు ఉన్నారు.
జాబితా
ర్యాంక్‌         వ్యక్తి        కంపెనీ                    సంపద
1    స్మితా కృష్ణ     గోద్రేజ్‌ గ్రూప్‌         రూ.37,570 కోట్లు
2    రోషిణి నాడార్‌     హెచ్‌సీఎల్‌ టెక్‌         రూ.30,200 కోట్లు
3    ఇందు జైన్‌     టైమ్స్‌ గ్రూప్‌         రూ.26,240 కోట్లు
4    కిరణ్‌ మజుందార్‌ షా    బయోకాన్‌         రూ.24,790 కోట్లు
5    కిరణ్‌ నాడార్‌     శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌     రూ.20,120 కోట్లు
6    లీనా గాంధీ తివారీ                 రూ.10,730 కోట్లు
7    సంగీతా జిందాల్‌                 రూ.10,450 కోట్లు
8    జయశ్రీ ఉల్లాల్‌                 రూ.9,490 కోట్లు
9    అను అగా                 రూ.8,550 కోట్లు
10    శ్రద్ధా అగర్వాల్‌     

views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams