Current Affairs Telugu Daily

ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసిన సోనీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన బ్రావియా ఎక్స్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ టీవీలను తాజాగా విడుదల చేసింది. ఈ టీవీలలో 4కె హెచ్‌డీఆర్ ప్రాసెసర్ ఎక్స్1 ఎక్స్‌ట్రీమ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన టీవీల కన్నా ఇవి తక్కువ విద్యుత్‌ను వాడుకోవడమే కాదు, క్వాలిటీ పిక్చర్ ఔట్‌పుట్ ను ఇస్తాయి. ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ టీవీల్లో ఏర్పాటు చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ వంటి యాప్‌లను నేరుగా టీవీల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక వీటిలో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన వీడియోలను ప్లే చేసుకోవచ్చు.
views: 916

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams