Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా బండా శివానంద ప్రసాద్‌ 
తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)గా బండా శివానంద ప్రసాద్‌ నియమితులయ్యారు.
  • ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి 2018 ఆగస్టు 10న జారీ చేశారు.
  • వరంగల్‌ జిల్లా జనగామకు చెందిన బీఎస్‌ ప్రసాద్‌ 1963లో జన్మించారు. 1987 జనవరిలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన గత మూడు దశాబ్దాల్లో  హైకోర్టులో పలు కీలక కేసుల్లో వాదించారు.
  • సివిల్‌, బ్యాంక్‌ సర్వీసు చట్టాలపై గట్టిపట్టుంది. పలు బ్యాంకులకు న్యాయసలహాదారుగానూ వ్యవహరించారు. బీఎస్‌ ప్రసాద్‌ ప్రస్తుతం హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ బహిష్కరణ వ్యాజ్యాల నేపథ్యంలో ప్రకాశ్‌రెడ్డి 2018 మార్చి 26న ఏజీ పదవికి రాజీనామా చేశాడు.
  • ఆ రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 10న ఆమోదించింది. ఆ వెంటనే నూతన అడ్వొకేట్‌ జనరల్‌గా బీఎస్‌ ప్రసాద్‌ను నియమించింది.
  • తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర తొలి ఏజీగా కె.రామకృష్ణారెడ్డి సేవందించారు. రెండో ఏజీ డి.ప్రకాశ్‌రెడ్డి కాగా, బీఎస్‌ ప్రసాద్‌ ఆ పదవిని చేపట్టిన మూడో వ్యక్తి.  
  • ఏజీ పదవికి ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశాక ఆ పోస్టును ఇప్పటి వరకు భర్తీ చేయకపోవడంతో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది సతీష్‌కుమార్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు.
  • శశిధర్‌రెడ్డి వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కొత్త ఏజీ నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

views: 1040

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams