Current Affairs Telugu Daily

వాణిజ్య న్యాయస్థానాల సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం
వాణిజ్య వివాదాల వేగవంత పరిష్కారానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది.
  • లోక్‌సభలో 2018 జులై 31నే ఆమోదం పొందగా ఆగస్టు 10న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
  • వాణిజ్య న్యాయస్థానాలు, హైకోర్టు వాణిజ్య విభాగం, వాణిజ్య అప్పిలేట్‌ విభాగం సవరణ బిల్లు-2018పై జరిగిన చర్చకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమాధానమిస్తూ చిన్న వ్యాపారాల వారు కూడా పెద్ద వాణిజ్య సంస్థల్లాగా వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందన్నారు.
  • వాణిజ్య న్యాయస్థానాలు విచారించదగిన వివాదాల విలువ పరిమితి గతంలో రూ.కోటి ఉండగా సవరణ బిల్లులో ఈ పరిమితిని రూ.3లక్షలకు తగ్గించారు.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams