Current Affairs Telugu Daily

సాయుధ పోరాట యోధుడు జగన్మోహన్‌రెడ్డి మృతి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్రోద్యమ నాయకుడు కొండవీటి జగన్మోహన్‌రెడ్డి (జగాల్‌) 2018 ఆగస్టు 9న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివె గ్రామానికి చెందిన జగన్మోహనరెడ్డి మునుగోడు కేంద్రంగా నిర్వహించిన అనేక సాయుధ పోరాటాల్లో కీలక పాత్రను పోషించారు.
  • ఆంధ్ర మహాసభకు ప్రేరేపితులై ఉద్యమబాట పట్టారు. భూస్వాములకు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరీ నిర్మూనలకు తన స్వగ్రామం నుంచే ఉద్యమాన్ని ప్రారంభించారు.
  • సొంత భూములను పేదలకు పంపిణీ చేశారు. గుండ్రాంపల్లి, వావిళ్లపల్లి, జనగాం, కొంపల్లి, అప్పాజిపేటలో రజాకార్లతో పోరాడారు.

views: 969

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams