Current Affairs Telugu Daily

గ్రామీణాభివృద్ధిలో19 పురస్కారాలు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్‌
గ్రామీణాభివృద్ధిశాఖ సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అందించే అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ 19 గెలుచుకొంది. ఇందులో 3 రాష్ట్రస్థాయి, 2 జిల్లాస్థాయి, 4 మండలస్థాయి, 10 గ్రామపంచాయతీస్థాయి అవార్డులున్నాయి. సోమవారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ వీటిని ప్రధానం చేయనున్నారు. పారదర్శకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పన, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పంపిణీ, గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, పంటకాలువలు, మురుగునీటి కాలువలు, మంచినీటి చెరువులు, పంట కుంటల తవ్వకం విభాగాల్లో 2015-16 సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్‌ ఈ పురస్కారాలను అందుకుంటోంది.
views: 1298

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams