Current Affairs Telugu Daily

BCCI  కొత్త రాజ్యాంగానికి సుప్రీంకోర్టు ఆమోదం
BCCI  కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఒకే రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న ప్రతిపాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
  • అంటే గతంలోలాగే మహారాష్ట్ర (మహారాష్ట్ర, ముంబయి, విదర్భ), గుజరాత్‌ (సౌరాష్ట్ర, బరోడా, గుజరాత్‌) రాష్ట్రాల్లోని అన్ని సంఘాలకు తిరిగి పూర్తి స్థాయి సభ్యత్వం, ఓటు హక్కు ఉంటాయి.
  • లోధా కమిటీ సూచనతో ఇంతకుముందు ముంబయి, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ ఓటు హక్కు కోల్పోయాయి. రాష్ట్ర సంఘాలుగా లేని రైల్వేస్‌, సర్వీసెస్‌, నేషనల్‌ క్రికెట్‌ క్లబ్‌, క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంఘాలకు కూడా పూర్తి స్థాయి సభ్యత్వం ఉండరాదని కమిటీ ఇంతకుముందు సూచించింది.
  • ఐతే వీటిలో సర్వీసెస్‌, రైల్వేస్‌, ఆసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు పునరుద్ధరించింది. దీంతో వాటికి మళ్లీ ఓటు హక్కు దక్కింది.
  • ఆఫీస్‌ బేరర్ల పదవీకాలాల మధ్య విరామం ఉండాలన్న లోధా కమిటీ సూచనను ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆమోదించింది.
  • కానీ మార్పులు చేసింది. ఇక BCCIలో గానీ, రాష్ట్రంలో గానీ లేదా రెండింటిలో కలిపి గానీ పర్యాయానికి మూడేళ్ల చొప్పున రెండు వరుస పర్యాయాల తర్వాత విరామం (మూడేళ్లు) తీసుకోవాల్సివుంటుంది. అంటే ఓ అధికారి వరుసగా ఆరేళ్లు పదవిలో ఉండొచ్చన్నమాట.
  • లోధా కమిటీ సూచన ప్రకారం ఒక్క పర్యాయం తర్వాతే విరామం తీసుకోవాల్సివుంది. 70 ఏళ్ల వయోపరిమితిపై వివరాలు తెలియాల్సివుంది. 30 రోజుల్లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించాలని 2018 ఆగస్టు 9న తన తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించింది. 
  • 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం నేపథ్యంలో BCCIలో సంస్కరణ ప్రక్రియ ప్రారంభించింది. బోర్డులో సంస్కరణ కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ BCCI పాలనా వ్యవస్థలో సమూల మార్పులను సూచిస్తూ 2016 జనవరిలో నివేదికను విడుదల చేసింది.
  • అందులో చాలా వరకు ఆమోదించిన కోర్టు BCCIలో సంస్కరణ అమలు పర్యవేక్షణ బాధ్యతలను లోధా కమిటీకే అప్పగించింది. ఆ తర్వాత ఆరు నెలల కాలంలో BCCI, రాష్ట్ర సంఘాలు సంస్కరణనలు అమలు చేయలేదు.
  • దీంతో సుప్రీంకోర్టు 2017 జనవరిలో సంస్కరణనలు అమలు చేసేందుకు వినోద్‌ రాయ్‌ సారథ్యంలో BCCI పరిపాలకుల కమిటీని నియమించింది.
  • ఆ తర్వాత 18 నెలల పాటు సీఓఏ, పదవిలో ఉన్న BCCI ఆఫీస్‌ బేరర్ల మధ్య పెద్ద వివాదమే నడిచింది. BCCIరివ్యూ పిటిషన్‌ను కొత్త న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది.
  • చివరికి లోధా కమిటీ సూచనల్లో కీలక మార్పు చేస్తూ BCCI కొత్త రాజ్యాంగానికి అంగీకారం తెలిపింది.
BCCI-Board of Control for Cricket in India

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams