Current Affairs Telugu Daily

ట్రాయ్‌ ఛైర్మన్‌ రామ్‌సేవక్‌ శర్మ పదవీకాలం పొడిగింపు
ట్రాయ్‌ ఛైర్మన్‌గా రామ్‌సేవక్‌ శర్మ మరో 2 సం॥ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలం పొడిగించేందుకు నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
  • శర్మ పదవీ కాలం ముగియడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.
  • వ్యక్తిగత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 2018 ఆగస్టు 10 నుంచి 2020 సెప్టెంబరు 30 వరకు (ఆయనకు 65 ఏళ్లు వచ్చే నాటికి) ట్రాయ్‌ ఛైర్మన్‌గా ఆర్‌.ఎస్‌.శర్మ కొనసాగుతారు.
  • ఆధార్‌ సంఖ్య బహిర్గతం కావడం వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదనే విషయంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో తన ఆధార్‌ నెంబరును వెల్లడించి శర్మ ఇటీవల వార్తల్లో నిలిచారు.
  • 1982 బ్యాచ్‌ (రిటైర్డ్‌) ఝార్ఖండ్‌ కేడర్‌కు చెందిన శర్మ.. 2015 జులైలో మూడేళ్ల పదవీకాలానికి ట్రాయ్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన హయాంలో టెలికాం రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
TRAI-Telecom Regulatory Authority of India

views: 732

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams