Current Affairs Telugu Daily

ముమ్మారు తలాక్‌కు 3 సవరణలు 
‘ముమ్మారు తలాక్‌ బిల్లు’కు కేంద్రమంత్రివర్గం 3 కీలక సవరణలు చేసింది. తలాక్‌ చెప్పిన భర్తను వెంటనే అరెస్టు చేయకుండా, బెయిల్‌ ఇచ్చే అధికారాలన్ని న్యాయమూర్తికి కట్టబెట్టారు.
  • మైనర్‌ పిల్లలతోపాటు తనకూ జీవనభృతి ఇప్పించాలని, వారిని తానే సంరక్షించుకుంటానని మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించే హక్కు కూడా మహిళలకు సంక్రమించనున్నాయి. ఇరుగుపొరుగువారు చేసే ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసే నిబంధనను తొలగించారు.
  • ప్రతిపక్షాల అభ్యంతరాలు, కొన్ని ముస్లింవర్గాల ఆందోళన నేపథ్యంలో ‘ముమ్మారు తలాక్‌’ బిల్లుకు కేంద్రం మూడు సవరణలు చేసింది. చట్టాన్ని అతిక్రమించిన భర్తపై కేసు ఎవరు పెట్టవచ్చు?, బెయిల్‌ ఎవరు ఇవ్వొచ్చు?, మనసు మారి తిరిగి ఒక్కటవుదామనుకునే దంపతులు ఏం చేయాలి? అనే విషయాలపై తాజా సవరణ బిల్లులో స్పష్టత ఇచ్చారు. 
కొత్త బిల్లులో సవరణలు...
  •  బెయిల్‌ ఇవ్వాలంటే : ముమ్మారు తలాక్‌ చెబితే ఇప్పటికీ బెయిల్‌కు వీలుకాని కేసుగానే పరిగణిస్తారు. న్యాయమూర్తి మాత్రమే బెయిల్‌ మంజూరు చేయగలుగుతారు.
  • మహిళ వాదన పూర్తిగా విన్న తరువాత బెయిల్‌ ఇవ్వాలా, వద్దా? అనేది ఆయన విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మహిళకు భర్త నుంచి ఎంత నష్టపరిహారం ఇప్పించాలనేది కూడా ఆయనే నిర్ణయిస్తారు. పోలీసుకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే అధికారం లేదు. 
  •  కేసు ఎవరు పెట్టొచ్చంటే: భర్తపై భార్య లేదా ఆమె రక్తసంబంధీకులు లేదా ఆమె బంధువులు మాత్రమే పోలీసుకు ఫిర్యాదు చేయవచ్చు. ఇతరులెవ్వరు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయరు. 
  •  రాజీకి వీలైన నేరం: భార్యాభర్తలను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినప్పుడు, ఇద్దరూ రాజీ పడితే దాన్ని అంగీకరించే అధికారం ఆయనకు ఉంటుంది. అప్పటికప్పుడు కేసును ఉపసంహరించుకోవచ్చు. 
పాత బిల్లులోని అంశాలు ..
  • భర్తపై భార్య ఫిర్యాదు చేస్తే పోలీసు నాన్‌బెయిబుల్‌ కేసు నమోదు చేస్తారు. కోర్టులో విచారణ తరువాతే బెయిల్‌ మంజూరు చేయడానికి అవకాశం ఉంది. 
  • భర్తపై భార్య లేదా ఆమె రక్తసంబంధీకులు లేదా ఆమె బంధువులతో పాటు ఇరుగుపొరుగువారు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.  
  • కోర్టులో విచారణకు ముందు రాజీకి అవకాశం లేదు. లోక్‌సభలో బీజేపీకి సంఖ్యాబలం ఉంది కాబట్టి, డిసెంబరు 28, 2017న ముస్లిం మహిళా బిల్లు ఆమోదం పొందింది.
  • ప్రతిపక్షాలు 19 సవరణలు చేయాలని డిమాండు చేసినా, ప్రభుత్వం ఒక్కటి కూడా మార్చలేదు. కాంగ్రెస్‌ ఆమోదించినా, ఆర్జేడీ, ఏఐఎంఐఎం, బీజేడీ, అన్నాడీఎంకే, ఏఐఎంఎల్‌ ఎంపీలు వ్యతిరేకంగా నిలిచారు.

views: 743

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams