Current Affairs Telugu Daily

‘యువ శాస్త్రవేత్త-2018’ పురస్కారాలకు ఇద్దరు ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధకులు 
కేన్సర్‌ వ్యాధిని తొలిదశలో గుర్తించే అంశంపై ఒకరు.. బయోమెడికల్‌ అప్లికేషన్స్‌లకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్‌ పరికరాలను రూపొందించడంలో ఇంకొకరు.. ఇలా ఇద్దరు యువ ఆచార్యులు 
  • నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా(ఎన్‌ఏఎస్‌ఐ) ప్రకటించిన ‘యువ శాస్త్రవేత్త -2018’ జాబితాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు చోటు దక్కించుకున్నారు.
  • ఈసారి దేశవ్యాప్తంగా 20 మందికి ఈ పురస్కారాన్ని అందించనుండగా అందులో  ఇద్దరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులే ఉన్నారు. 
  • కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడంతో పాటు సమర్థ చికిత్స విధానాల ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కొనే అంశమై బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అరవింద్‌కుమార్‌ రెంగన్‌ కొన్నేళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు.
  • నానో సాంకేతికతను ఇందుకోసం ఉపయోగిస్తూ ఇప్పటికే సత్ఫలితాలను రాబట్టారు.
  • ప్రస్తుతం గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను తొలి దశలోనే ఇంట్లోనే సుభంగా గుర్తించేందుకు ఆయన ఆధ్వర్యంలోని బృందం కిట్‌నూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
  • కాలిన గాయాతో చర్మం స్పర్శజ్ఞానాన్ని కోల్పోయిన బాధితుల కోసం ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సహ ఆచార్యురాలిగా పనిచేస్తున్న సుష్మీ బదులిక ‘ఈ- చర్మం’ కనిపెట్టారు.
  • బయోమెడికల్‌ అప్లికేషన్స్‌లో ఉపయోగించేందుకు ఎలక్ట్రానిక్‌ పరికరాలను రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమైన మెటీరియల్స్‌నూ ఆమె ఆవిష్కరిస్తున్నారు. 
  • హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో వృక్షశాస్త్రం(ప్లాంట్‌ సైన్సెస్‌) విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జోగిమధుప్రకాశ్‌, ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త జాన్‌ మండల్‌లు ఎన్‌ఏఎస్‌ఐ పురస్కారాలను దక్కించుకున్నారు.

views: 1179



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams