Current Affairs Telugu Daily

స్థిరాస్తి స్వాధీన సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రక్షణ, భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులపై పరిహార చెల్లింపు నిబంధనలు మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.
  • చిన్నపాటి సవరణలతో ఈ స్థిరాస్తి స్వాధీన(సవరణ) బిల్లును రాజ్యసభ 2018 జులై 18న ఆమోదించగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి తిరిగి లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చ లేకుండానే సభ్యులు మూజువాణీ పద్ధతిలో 2018 ఆగస్టు 7న ఆమోదించారు.
  • ఈ బిల్లు ప్రకారం కేంద్రం స్వాధీన నోటీసు ఇవ్వడానికి ముందు స్థిరాస్తి యజమానికి వాదననలు వినిపించే అవకాశం కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఈ సందర్భంగా ఆస్తిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదన్న విషయానికి సదరు యజమాని కారణాలు చూపించాల్సి ఉంటుంది.
  • వాదనలు వినిపించేందుకు యజమానికి తగినంత అవకాశం కల్పించేలా గతంలోని కోర్టు ఆదేశాలు, తీర్పు, నోటీసులతో సంబంధం లేకుండా నోటీసులను తిరిగి జారీ చేసేందుకు కేంద్రానికి ఈ బిల్లు అనుమతినిస్తుంది.
  • అప్పటికే పరిహారాన్ని స్వీకరించినవారికి ఇలా తిరిగి నోటీసులు జారీ చేయరు. రెండో సారి నోటీసు ఇచ్చినవారికి పరిహారం చెల్లించే సమయంలో మొదటి నోటీసు జారీ తేదీ నుంచి ఆ మొత్తంపై వడ్డీని కూడా లెక్కగట్టి ప్రభుత్వం చెల్లిస్తుంది.

views: 804

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams