Current Affairs Telugu Daily

ఆదివాసీలకు ‘కేసీఆర్‌ కిట్‌’ నిబంధనల సడలింపు 
అంతరించిపోతున్న కొన్ని ఆదివాసీ జాతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్‌ కిట్‌’ నిబంధనలను సడలించింది.
  • గరిష్ఠంగా రెండు కాన్పులకే ఈ పథకం వర్తిస్తుందనే షరతును ఎత్తేసింది. సాధారణ ప్రజలతో.. వీరి జీవన విధానాన్ని పోల్చలేమనే కారణంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు 2018 ఆగస్టు 2న విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • ఆదివాసీ జాతులను సంరక్షించుకోవడమే లక్ష్యంగా తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
  • దీని వల్ల దాదాపు 22 వేల మందికిపైగా ఆదివాసీ మహిళలు లబ్ధిపొందనున్నారు. చెంచు, కొలాం, తాటి, కొండరెడ్డి తెగలకు ఈ సడలింపు వర్తిస్తుంది.
  • కాన్పుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్ని ప్రసవాలు జరిగినా.. ఈ పథకం కింద అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడితే రూ.13 వేల చొప్పున నాలుగు విడతలుగా గర్భిణి బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమచేస్తారు.
  • ప్రసవించిన ప్రతిసారీ తల్లీబిడ్డలకు 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్‌ కిట్‌ను అందిస్తారు. లబ్ధిపొందనున్న వారి సమాచారాన్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

views: 1315

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams