Current Affairs Telugu Daily

ప్రభుత్వానికి అనుకూలంగానే లబ్ధి ఉండాలి ;సుప్రీం
పన్ను మినహాయింపుల ప్రకటనల్లో ఏమైనా సందిగ్ధత ఉన్నట్లయితే దానివల్ల కలిగే లబ్ధి తప్పనిసరిగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండేలా భాష్యం చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • 21 ఏళ్ల క్రితం దీనికి విరుద్ధంగా వెలువడిన తీర్పును కొట్టివేసింది. పన్ను మినహాయింపు ప్రకటనల్లో అస్పష్టత ఉంటే అలాంటి మినహాయింపుల్ని కోరుతున్న మదింపుదారునికి అనుకూలంగా భాష్యం చెప్పాలని 1997లో ‘సన్‌ ఎక్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌’ కేసులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం చెప్పింది.
  • 2018 జులై 31న జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తాజా ఉత్తర్వులిచ్చింది.
  • సందిగ్ధత ఉన్నప్పుడు లబ్ధిని మదింపుదారుడు కోరలేడని పేర్కొంది. మినహాయింపు ప్రకటన పరిధికి లోబడి తనకు లబ్ధి వర్తించాల్సి ఉందని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మదింపుదారునిపైనే ఉందంది.

views: 1133

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams