Current Affairs Telugu Daily

లంచం ఇచ్చినవారికి 7సం''లు జైలుశిక్షకు  రాష్ట్రపతి ఆమోదం
లంచం ఇచ్చేవారికి గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన నూతన చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.
  • రాజకీయ నాయకులు, అధికారులు, బ్యాంకర్లు తదితరులకు ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ)-1988’ కొంతమేర రక్షణ కల్పిస్తుంది.
  • విశ్రాంత ప్రభుత్వోద్యోగులకూ ఇది వర్తిస్తుంది. ఇలాంటివారిపై ఏదైనా విచారణ చేపట్టాలంటే సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు తగిన అధికార వర్గాల నుంచి ముందుగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఇలాంటి ఆమోదం లేకుండా పోలీసు అధికారులెవరూ ప్రభుత్వోద్యోగులపై దర్యాప్తు, విచారణ చేపట్టడానికి వీల్లేదని చట్టం చెబుతోంది.
  • తన కోసం, లేదా ఇతరుల తరఫున అయాచిత ప్రయోజనాలను స్వీకరిస్తూ ఘటనా స్థలంలోనే దొరికిపోయిన కేసుల్లో మాత్రం ముందస్తు అనుమతి అవసరం లేదు.
  • బలవంతపు పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వచ్చినవారిని రక్షించేలా చట్టంలో ఒక నిబంధన చేర్చారు. ఇలాంటివారు సంబంధిత దర్యాప్తు సంస్థలకు వారం రోజుల్లోగా వివరాలు నివేదించాల్సి ఉంటుంది.
  • లంచం పుచ్చుకునేవారికి కనీస కారాగార శిక్షను మూడేళ్లుగా నిర్ణయించారు.
  • దీనికి అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. ప్రజా ప్రతినిధులకు అనుచిత లబ్ధి కలిగించేలా ఏదైనా వాణిజ్య సంస్థ లంచమిచ్చినా, ఇచ్చేందుకు హామీ ఇచ్చినా శిక్ష తప్పదు.
  • అవినీతి సంబంధిత కేసులను రెండేళ్లలోగా కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది.

views: 1162

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams