Current Affairs Telugu Daily

ఎకోసాక్‌కు మరోసారి ఎన్నికైన భారత్‌
ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక మండలికి (ఎకోసాక్‌) భారత్‌ మరోసారి ఎన్నికైంది. ఎకోసాక్‌లోని 18 ఖాళీలను భర్తీ చేయటానికి గురువారం జరిగిన ఎన్నికల్లో భారత్‌కు 183 ఓట్లు వచ్చాయి. ఆసియా పసిఫిక్‌ విభాగంలో జపాన్‌ తర్వాత ఎక్కువ ఓట్లు భారత్‌కే పడ్డాయి. ‘‘మరో రోజు. మరో ఎన్నిక. భారత్‌కు మరో గెలుపు. ఐరాస సభ్యదేశాలు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు. భారత్‌ మరోసారి ఎకోసాక్‌కు ఎన్నికైంది’’ అని ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ట్విటర్‌ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాల నిపుణురాలు నీరూ చద్దా.. ఇంటర్నేషనల్‌ ట్రైబ్యునల్‌ ఫర్‌ లా ఆఫ్‌ ద సీ (ఐటీఎల్‌ఓఎస్‌) న్యాయమూర్తిగా ఎన్నికైన మర్నాడే భారత్‌ ఈ ఘనత సాధించటం విశేషం. ఈ ట్రైబ్యునల్‌కు న్యాయమూర్తిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగానూ చద్దా రికార్డు సృష్టించారు. ఎకోసాక్‌లో భారత్‌ ప్రాతినిధ్యం ఈ ఏడాదితో ముగుస్తుంది. తాజా ఎన్నికతో భారత్‌కు మరో మూడేళ్ల పాటు ఎకోసాక్‌లో ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇందులో పాకిస్థాన్‌ గడువు 2017, డిసెంబరు 31తో ముగుస్తుంది. అయితే ఈసారి తాము పోటీకి దిగలేదని పాక్‌ శాశ్వత మిషన్‌ తెలిపింది.
ECOSOC-the UN Economic and Social Council ( one of the six principal organs of the United Nations)

views: 896



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams