పశ్చిమ బెంగాల్ పేరు ‘‘బంగ్లా’’గా మార్చే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
పశ్చిమ బెంగాల్ పేరును ‘‘బంగ్లా’’గా మార్చేందుకు ప్రతిపాదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ 2018 జులై 26న ఆమోదించింది.
బెంగాలీతో పాటు ఇంగ్లీష్, హిందీలోనూ రాష్ట్రం పేరును బంగ్లాగానే దీనిలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ అక్షర వరుసక్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని తొలి అక్షరం ‘‘డబ్ల్యూ’’ చివరన ఉండటంతో దీన్ని కొంచెం మొదటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన చేశారు.
దీన్ని కేంద్ర హోం శాఖ ఆమోదించాల్సి ఉంది. ఇదివరకు బెంగాలీలో ‘బంగ్లా’, ఇంగ్లీష్‌లో ‘బెంగాల్’, హిందీలో ‘బంగాల్’ అని 3 పేర్లతో ఓ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని కేంద్రం తిరస్కరించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్)
పశ్చిమ బెంగాల్ గవర్నర్ - కేసరినాథ్ త్రిపాఠి
పశ్చిమ బెంగాల్ రాజధాని - కోల్‌కతా
AITC - All India Trinamool Congress
TMC - Trinamool Congress
views: 1296