Current Affairs Telugu Daily

తాజ్‌మహల్‌ ప్రాంతం ప్లాస్టిక్‌రహితంగా మారాలి
తాజ్‌మహల్‌ కట్టడం చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది.
  • స్థానికంగా కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను మూసివేయాలని సూచించింది. తాజ్‌మహల్‌ పరిరక్షణ అంశంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన దార్శనిక పత్రం ముసాయిదాలో ఈ విషయాలను పేర్కొంది.
  • తాజ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ.. ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ అంశంపై ఒక ముసాయిదా దార్శనిక పత్రాన్ని దాఖలు చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనికి ధర్మాసనం సమ్మతించింది. ఆ మేరకు తాజాగా దార్శనిక పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. 
దార్శనిక పత్రంలోని వివరాలు..
  • తాజ్‌ను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా ప్రకటించడంతోపాటు వాటర్‌ బాటిళ్ల వినియోగాన్ని కూడా నిషేధించాలి
  • ఈ ప్రాంతంలో కాలుష్యకారక పరిశ్రమను మూసేయడంతోపాటు పర్యాటక హబ్‌ను ఏర్పాటు చేయాలి
  • తాజ్‌ ప్రాంగణం పరిసరాల్లో పాదచారుల మార్గాలను ప్రోత్సహించేందుకు సమగ్ర ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళిక అవసరం. యమునా నదీముఖం వెంబడి రోడ్లపై వాహన రద్దీ తక్కువగా ఉండేలా చూడాలి. 
  • యమున వరద మైదానం వెంబడి ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. నది ఒడ్డున చెట్లు నాటాలి.

views: 1159



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams