Current Affairs Telugu Daily

నరేంద్రమోడి రువాండా పర్యటన
3 తూర్పు ఆఫ్రికా దేశా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 జులై 23, 24 తేదీల్లో రువాండాలో పర్యటించారు.
  • జులై 23న రువాండా రాజధాని కిగాలీలో ఆ దేశాధ్యక్షుడు పాల్‌ కగామే విమానాశ్రయానికి వచ్చి మోడికి ఘన స్వాగతం పలికారు.
  • జులై 23న కిగాలిలో ప్రవాస భారతీయులనుద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోడి ప్రసంగించారు. రువాండాలో ఉన్న ప్రవాస భారతీయులు ఎప్పటి నుంచో కోరుతున్న మేరకు తమ హైకమిషన్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు మోడి ప్రకటించారు.
  •  హైకమిషన్‌ ఏర్పాటు ద్వారా ప్రవాసులు తమ మాతృభూమితో మరింతగా అనుసంధానం కావచ్చని చెప్పారు.
  • పర్యటనలో భాగంగా కగామేతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాలను పెంపొందించుకునే చర్యల్ని ఇరువురు నేతలు సమీక్షించారు. 
  • పేదరికాన్ని తగ్గించి,పిల్లల్లో పౌష్ఠికాహార లోపాన్ని అధిగమించడం లక్ష్యంగా పేద కుటుంబాలకు ఆవును ఇచ్చే ‘గిరింకా’ కార్యక్రమానికి భారత్‌ తరఫున 200 గోవుల్ని 2018 జులై 24న మోడి కానుకగా సమర్పించారు.
  • రువేరు అనే గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేదలకు 200 ఆవును కానుకగా ఇచ్చారు. పేదరికం, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు కుటుంబానికొక ఆవును పంపిణీచేయడం 2006 నుంచి అక్కడ సంప్రదాయంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ‘గిరింకా’ అని పిలుస్తున్నారు.
  • పాల దిగుబడితో పాటు సేంద్రియ సేద్యానికి ఊతమిచ్చే ఈ కార్యక్రమ రూపకల్పనలో అధ్యక్షుడి చొరవను ఆయన అభినందించారు. పేదలు అదనపు ప్రయోజనాన్ని పొందడానికి ఇదే తరహాలో తేనెటీగ పెంపకాన్నీ చేపట్టవచ్చని సూచించారు.
  • దీనికి కావాల్సిన సహకారాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందని మోడి చెప్పారు.
  • రువాండాలో 1994లో టుత్సీకి వ్యతిరేకంగా పోరాడి 2.50 లక్షల మంది సామూహిక మారణ హోమంలో బలైపోవడానికి ప్రతీకగా నిర్మించిన స్మారకాన్ని మోడి జులై 24న సందర్శించారు. మృతవీరుల స్ఫూర్తిని కొనియాడారు. 
  • రువాండాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. ఆఫ్రికా ఖండంలో ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశంలో రువాండా గుర్తింపు పొందింది.
రువాండా అధ్యక్షుడు - పాల్‌ కగామే
రువాండా రాజధాని - కిగాలి
రువాండా కరెన్సీ- రువాండన్‌ ఫ్రాంక్‌

views: 1072

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams